Share News

వ్యాన్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - May 10 , 2026 | 12:24 AM

లట్టిగాం సమీ పంలో జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాపుతెంబూరు గ్రామానికి చెందిన కోమటూరు ప్రసాదరావు(41) మృతి చెందారు.

వ్యాన్‌ ఢీకొని వ్యక్తి మృతి

నందిగాం, మే 9(ఆంధ్రజ్యోతి): లట్టిగాం సమీ పంలో జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాపుతెంబూరు గ్రామానికి చెందిన కోమటూరు ప్రసాదరావు(41) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ప్రసాదరావు పిల్లల చదువు కోసం లట్టిగాంలో అద్దె కు ఇల్లు తీసుకొని కుటుంబసభ్యులతో నివసిస్తున్నా డు. శనివారం ఉదయం పలాస వెళ్లేందుకు జాతీ యరహదారిపై ఉండగా.. అటుగా తెలిసిన వ్యక్తి (డ్రైవర్‌) ఉండడంతో అతన్ని కలిసేందుకు వెళ్తుండగా టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న వ్యాన్‌ వెనుక నుంచి ఢీకొనడంతో ప్రసాదరావు తీవ్రంగా గాయ పడ్డాడు. వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తర లించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈయనకు భార్య శాంతి కుమారితో పాటు కుమారుడు నిరంజన్‌, కుమార్తె కావ్యశ్రీ ఉన్నారు. శాంతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

జలుమూరు (సారవకోట), మే 9(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం సారవకోట గ్రామానికి చెందిన బొల్లు తిరుపతిరావు (54) శనివారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నా నికి పాల్పడ్డాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... గత కొన్నాళ్లుగా కుటుంబ కలహాలు కారణంగా తిరుపతిరావు శనివారం ఉదయం ఇంటివద్దను ఎవరు లేని సమయంలో గడ్డిమందు తాగి అస్వస్తతకు గురయ్యాడు. దీంతో ఇరుగు పొరుగు వారు గుర్తించి 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రథమ చికిత్స అందించి నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - May 10 , 2026 | 12:24 AM