మద్యం తాగొద్దున్నారని వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:27 PM
శ్రీకూర్మం వెలమవీధికి చెందిన సాధు లక్ష్మణరావు (46) సోమ వారం ఉదయం గ్రామంలోని ఆత్మహత్య చేసుకు న్నాడని ఎస్‌ఐ సీహెచ్.గంగరాజు తెలిపారు.
గార, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మం వెలమవీధికి చెందిన సాధు లక్ష్మణరావు (46) సోమ వారం ఉదయం గ్రామంలోని ఆత్మహత్య చేసుకు న్నాడని ఎస్‌ఐ సీహెచ్.గంగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మణరావు గ్రామం లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం తాగవ ద్దని కుటుంబ సభ్యులు అనడంతో మనస్తాపానికి గురై సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య సుమంగళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.