Share News

ఆర్టీసీ కండక్టర్‌పై వ్యక్తి దాడి

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:19 AM

ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ఓ ప్రయాణికు డు దాడి చేసిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది.

ఆర్టీసీ కండక్టర్‌పై వ్యక్తి దాడి

  • బస్సులో కూతురును చేతితో తోశాడని..

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ఓ ప్రయాణికు డు దాడి చేసిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం పలాస నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ (ఎక్స్‌ప్రెస్‌) బస్సులోకి కొత్తపేట జంక్షన్‌ వద్ద గంగుపేట గ్రామానికి చెందిన అర్జునరావు తన కుమార్తెతోపాటు మరికొందరితో కలిసి ఎక్కాడు. ఈ క్రమంలో జర్జంగి గ్రామ సమీపానికి బస్సు వచ్చే సరికి ఫుట్‌పాత్‌పై ఉన్నవారిని లోపలకి వెళ్లాలని కండక్టర్‌ నాశపు పాపారావు ప్రయాణికులకు సూచించారు. ఇదే సమ యంలో కండక్టర్‌ ప్రయాణికులను నెడుతున్న క్రమంలో అర్జునరావు కుమార్తెను కూడా చేతితో తోశాడు. దీన్ని గమనించిన అర్జునరావు ఆగ్రహంతో కండక్టర్‌ పాపారావుపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై పాపారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ చెప్పారు.

Updated Date - Apr 02 , 2026 | 12:19 AM