Share News

6.9 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:07 AM

గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం అరెస్ట్‌ చేసినట్లు సోంపేట సీఐ బి.మంగరాజు సోమవారం తెలిపారు.

6.9 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు

కంచిలి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం అరెస్ట్‌ చేసినట్లు సోంపేట సీఐ బి.మంగరాజు సోమవారం తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఒడిశాకు చెందిన అవినాష్‌ నుంచి 6.9 కిలోల గంజాయిని చెన్నైకి చెందిన రాహుల్‌ కొనుగోలు చేసి మూడు బ్యాగుల్లో పెట్టుకుని సోంపేట రైల్వే స్టేషన్‌కు చెన్నై వెళ్లేందుకు ఉదయం వచ్చాడు. అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతడిని కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు, సిబ్బంది పట్టుకుని విచారణ చేశారు. తను ఉపయోగించడంతోపాటు అధిక ధరకు విక్రయించేందుకు గంజాయి తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపాడన్నారు. నిందితుని వద్ద గంజాయితో పాటు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 12:08 AM