Share News

శాశ్వత లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:46 PM

ప్రజా ప్రయోజనార్థం నిర్వహిస్తున్న శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

 శాశ్వత లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి
మాట్లాడుతున్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజనార్థం నిర్వహిస్తున్న శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని సంస్థ ప్రాంగ ణంలో ‘న్యాయ సేవాధికార సంస్థల చట్టం- 1987లోని సెక్షన్‌ 22ఏ(బి)’ కింద శాశ్వత లోక్‌ అదాలత్‌ పరిధిలోకి వచ్చే ప్రజా ప్రయోజన సేవ లపై వివిధ అనుబంధ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదాలపై కోర్టు ల చుట్టూ తిరగకుండా పరస్పర రాజీ ద్వారా పరి ష్కరించే విధానాన్ని వివరించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వివాదాల పరిష్కారా నికి ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 11న నిర్వహించనున్న శాశ్వత లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో శాశ్వత లోక్‌ అదాలత్‌ అధ్యక్షులు రజని, జి.ఇందిరా ప్రసాద్‌, ఎస్పీ కృష్ణవేణి, రాహుల్‌ చౌహాన్‌, యూనియన్‌ బ్యాంకు ప్రతి నిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:46 PM