Share News

వైద్య శిబిరాలను వినియోగించుకోండి

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:30 PM

ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సేవా సంకల్ప్‌ అభియాన్‌ కింద వైద్య శిబిరాలను నిర్వహిస్తోందని, వీటిని సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

 వైద్య శిబిరాలను వినియోగించుకోండి
మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

స్పెషలిస్టులతో రోగులకు వైద్య పరీక్షలు

శ్రీకాకుళం కల్చరల్‌, సెస్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సేవా సంకల్ప్‌ అభియాన్‌ కింద వైద్య శిబిరాలను నిర్వహిస్తోందని, వీటిని సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రిమ్స్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డా.లుక లాపు ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. అన్ని విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల తో ఈ వైద్యశిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ మెగా వైద్యశిబిరానికి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,269 మంది రోగులు వచ్చి వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జేడీ డా.రాజశేఖర్‌, డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌, ఏపీఈఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్‌ పీఎంజే బాబు, ప్రభుత్వ వైద్య కళా శాల ప్రిన్సిపాల్‌ డా.అప్పలనాయుడు, డీఎంవో సత్యనారాయణ, అదనపు డీఎంహెచ్‌ వో డా. తాడేల శ్రీకాంత్‌, రిమ్స్‌ ఆర్‌ఎంవో సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

‘బాధిత మహిళలకు భరోసా..’

వివిధ రకాల వేధింపులకు గురవుతున్న మహిళలకు సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ అండగా ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సెంటర్‌ భవనాన్ని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ పి. శోభారాణి, జిల్లా మిషన్‌ కోఆర్డినేటర్‌ డి.ఉమామహేశ్వరి, వనస్టాప్‌ సెంటర్‌ ఏవో వై.హిమబిందు, పోలీసు ఫెసిలిటేషన్‌ అధికారి పి.రేణుకారాణి, డీసీపీవో కె.రమణ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:30 PM