Share News

జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:39 PM

జిల్లాలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళా లను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ కోరారు.

 జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోండి
మాట్లాడుతున్న జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ

జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధ

ఎచ్చెర్ల, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళా లను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ కోరారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో గురువారం ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగేవారని, నేడు ఆ కంపెనీలే నిరుద్యోగుల ముంగిటకు వస్తున్నాయని వీటిని వినియోగించు కోవాలన్నారు. సరైన నైపుణ్యం ఉంటే ఉజ్వల భవిత ఉంటుందన్నారు. జిల్లా నైపు ణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్‌ మాట్లా డుతూ.. యువత ఉద్యోగ మేళాను సద్వినియో గం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాల న్నారు. ఈ ఉద్యోగ మేళాలో 10 కంపెనీలు హాజరుకాగా 47 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కార్యక్ర మంలో కళాశాల డైరెక్టర్లు బుడుమూరు శ్రీరామ్మూర్తి, ఇప్పిలి కిశోర్‌, ప్రిన్సిపాల్‌ రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 11:40 PM