సారా రవాణా కాకుండా చూసుకోండి
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:06 AM
ఒడిశా నుంచి సారా దిగుమతి కాకుండా నిరంతర గస్తీ ఏర్పా టుచేయాలని ప్రొహి బిషన్, ఎక్సైజ్ డిప్యూ టీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి
పాతపట్నం, ఫిబ్ర వరి 25(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి సారా దిగుమతి కాకుండా నిరంతర గస్తీ ఏర్పా టుచేయాలని ప్రొహి బిషన్, ఎక్సైజ్ డిప్యూ టీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి సూచించారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అలాగే పాతప ట్నంలోని మద్యం షాప్‌ను పరిశీలించి నిల్వల తనిఖీ చేశారు. అంతకుముందు మెళియాపుట్టిలోని వసుంధర చెక్‌పోస్టును పరిశీలించారు. పాతపట్నం మండల పరిధిలో బొన్ని, కోణంగి, పూతికగూడ, చాపరాయిగూడ గ్రామాల్లో నారా తయారీ, విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సారా కేసుల్లో పట్టుబడిన వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో నిరంతర గస్తీను ఏర్పాటుచేయాలని సీఐ కోట కృష్ణారావును ఆదేశించారు.