మోదీ సభ విజయవంతం చేయండి
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:23 AM
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తుండ డంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నియోజకవర్గం ప్రత్యేక అబ్జర్వర్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం నరసన్నపేటలో నియోజకవర్గం పరిధిలో గల జలుమూరు, నరసన్నపేట, సారవకోట, పోలాకి మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
నరసన్నపేట, జూలై 30 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తుండ డంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నియోజకవర్గం ప్రత్యేక అబ్జర్వర్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం నరసన్నపేటలో నియోజకవర్గం పరిధిలో గల జలుమూరు, నరసన్నపేట, సారవకోట, పోలాకి మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
15 బస్సుల ఏర్పాటు
నందిగాం, జూలై 30(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో ఆగస్టు ఒకటో తేదీన జరిగే మోదీ సభకు మండలం నుంచి తరలివెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా వ్యవ హరించాలని తహసీల్దార్ పి.సోమేశ్వరరావు కోరారు. గురువారం నందిగాం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలం నుంచి 15 బస్సులు ఏర్పాటు చేశామని, కేటాయించిన కేంద్రాల నుంచి సకాలంలో చేరుకొని ప్రయాణానికి సన్నద్ధం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో కుమార్ ప ట్నాయక్, పీఏసీఎస్ అధ్యక్షులు పినకాన అజయ్‌కుమార్, అధికారులు పి.మనో రత్నం, ఎం.నాగరాజు, జి.నర్శింహులు, ఎ.చిన్నారావు, సురేష్‌బెహరా, హరికృష్ణ, నర్శింగరావు, నాయకులు ఎస్.జానకిరాం, ఎస్.సుదర్శనరావు పాల్గొన్నారు.