Share News

‘ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోండి’

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:07 AM

‘స్వర్ణగ్రామం- స్వర్ణ వార్డు’లో భాగంగా ‘కౌశలం’ ద్వారా సోమవారం నగరంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నామని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో కోరారు.

‘ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోండి’

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణగ్రామం- స్వర్ణ వార్డు’లో భాగంగా ‘కౌశలం’ ద్వారా సోమవారం నగరంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నామని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో కోరారు. 80 అడుగుల రోడ్డు లోని గీతం డిగ్రీ కళాశాలలో ఈనెల 28న ఉదయం 8.30 గంటల నుంచి వివిధ పోస్టులకు సంబంధించి ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఫియట్‌ ఇండియా, ఎన్‌టీటీఫ్‌, మెకాట్రినిక్స్‌ సంస్థ ప్రతినిధులు హాజరై అర్హు లైన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు, 22 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. ఎటువంటి అనుభవం లేని వారు కూడా పాల్గొనవచ్చన్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీ యమైన వేతనంతో పాటు బోనస్‌, క్యాంటీన్‌, ఉచిత రవాణా సౌకర్యాలు కల్పిస్తారని పేర్కొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:07 AM