ఫిజియోథెరపీని సద్వినియోగం చేసుకోండి’
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:43 PM
ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి. జగన్మో హనరావు అన్నారు.
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి. జగన్మో హనరావు అన్నారు. ప్రపంచ ఫిజియోఽథెరపీ దినా న్ని పాతబస్టాండ్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ కేంద్రంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ.. పలు శారీరక రుగ్మతలకు ఫిజియోథెరపీ చేయించడం ద్వారా ప్రయోజనం కనిపిస్తుంద న్నారు. రెడ్‌క్రాస్ ద్వారా ఉచితంగా అందిస్తున్న సేవలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సిబ్బంది రమణ తదిత రులు పాల్గొన్నారు.
తలసీమియా చిన్నారులకు..
తలసీమియాతో బాధపడుతున్న 8 మంది చిన్నారులకు మంగళవారం రక్తాన్ని అందించారు. అలాగే బాధితులు, వారి సహాయకులకు భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ జగన్మోహనరావు, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.