Share News

అధికార లాంఛనాలతో మేజర్‌ అంత్యక్రియలు

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:55 AM

కామేశ్వరిపేట గ్రామానికి చెందిన ఆర్మీ మేజర్‌ సతివాడ భూషణరావు గుండెపోటుతో శనివారం రాత్రి మృతి చెంద గా.. మృతదేహం సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చారు.

అధికార లాంఛనాలతో మేజర్‌ అంత్యక్రియలు
అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్మీ అధికారులు, గ్రామస్థులు

నరసన్నపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): కామేశ్వరిపేట గ్రామానికి చెందిన ఆర్మీ మేజర్‌ సతివాడ భూషణరావు గుండెపోటుతో శనివారం రాత్రి మృతి చెంద గా.. మృతదేహం సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. దీంతో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జమ్ము-కశ్మీర్‌లో మృతిచెందడంతో అక్కడ నుంచి భూషణరావు మృతిదేహాన్ని విమానంలో విశాఖకు ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంతో కామేశ్వరిపేట తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అంత్యక్రియల్లో పాల్గొన్ని భూషణరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Jan 13 , 2026 | 12:55 AM