‘మేజర్’ వార్డులు ఏకగ్రీవం
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:09 AM
14 ward seats in Tekkali Panchayat elected unanimously టెక్కలి మేజర్ పంచాయతీలో 20 వార్డులకుగానూ.. 14 వార్డు స్థానాలు శుక్రవారం ఏకగ్రీవమయ్యాయి. అలాగే టెక్కలి మండలంలోని 27 పంచాయతీలకుగానూ.. గురువారం మూడు పంచాయతీలు, శుక్రవారం మరో మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
టెక్కలి పంచాయతీలో 14 వార్డుస్థానాలు..
టెక్కలి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): టెక్కలి మేజర్ పంచాయతీలో 20 వార్డులకుగానూ.. 14 వార్డు స్థానాలు శుక్రవారం ఏకగ్రీవమయ్యాయి. అలాగే టెక్కలి మండలంలోని 27 పంచాయతీలకుగానూ.. గురువారం మూడు పంచాయతీలు, శుక్రవారం మరో మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. టెక్కలి మేజర్‌పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. ఇందులో 1, 3, 4, 5, 6, 7, 8, 9, 13, 14, 16, 18, 19, 20 వార్డుస్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు. గురువారం టెక్కలి మండలంలో నర్శింగపల్లి సర్పంచ్‌గా పోలాకి శరణకుమారి, అక్కవరం సర్పంచ్‌గా బసవల చామంతి, భగవాన్‌పురం సర్పంచ్‌గా పొన్నాడ గోవిందమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గూడెం సర్పంచ్‌గా బొంగు రాజు, రావివలస సర్పంచ్‌గా బడే సాయిప్రియ, సీతాపురం సర్పంచ్‌గా సీపాన వెంకటరావును ఆయా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన అభ్యర్థులంతా టీడీపీ మద్దతుదారులే. మరో 21 పంచాయతీల్లో డిసెంబరు 2న ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డుసభ్యులకు ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రెయ్యిప్రీతీష్, కోళ్ల కామేసు, కోళ్ల లవకుమార్, లాడి శ్రీనివాస్, ప్రసాద్‌రెడ్డి, సువ్వారి రాజేశ్వరరావు, అభి, దేవానంద్ పాల్గొన్నారు.