ఘనంగా మజ్జిగౌరమ్మ ఆలయ వార్షికోత్సవం
ABN , Publish Date - May 31 , 2026 | 11:12 PM
:మండలంలోని కాశీరాజుకాశీపురంలో మజ్జిగౌరమ్మ ఆలయ 16వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయ పూజారి దుంపల గణపతి పర్యవేక్షణలో గ్రామస్థుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మహి ళలు ఘటాలతో మేళతాళాలు మధ్య పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి ముర్రాటలు చెల్లించారు. సామూహిక కుంకుమార్చనలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు.
నందిగాం, మే 31(ఆంధ్రజ్యోతి):మండలంలోని కాశీరాజుకాశీపురంలో మజ్జిగౌరమ్మ ఆలయ 16వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయ పూజారి దుంపల గణపతి పర్యవేక్షణలో గ్రామస్థుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మహి ళలు ఘటాలతో మేళతాళాలు మధ్య పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి ముర్రాటలు చెల్లించారు. సామూహిక కుంకుమార్చనలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు.
కైజోలలో గ్రామదేవతల ఉత్సవాలు
నందిగాం, మండలంలోని కైజోలలో మర్రిపోలమ్మ, పాతపట్నం అమ్మ గ్రామ దేవతల సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో మహిళలు మేళతాళాలు, పగటివేషాలు మధ్య అమ్మవార్ల ఆలయాలకు చేరుకొని చల్లదనాలు చేసి ఊరేగింపుగా దేవరలను గ్రామంలోకి తీసుకువచ్చారు. ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు సాగనున్నాయి.