నిర్వహణ లేక.. వినియోగానికి నోచుకోక
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:37 PM
ఇచ్ఛాపురంలోని సయ్యద్‌ఖాన్ చెరువు నిర్వహణ లేకపోవడంతో వినియోగానికి నోచుకోవడం లేదు. దశాబ్దాల చరిత్ర గల ఈచెరువులో నీరు లేకపోవడంతో ఎడారిలా మారిపోయింది.
ఇచ్ఛాపురం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలోని సయ్యద్‌ఖాన్ చెరువు నిర్వహణ లేకపోవడంతో వినియోగానికి నోచుకోవడం లేదు. దశాబ్దాల చరిత్ర గల ఈచెరువులో నీరు లేకపోవడంతో ఎడారిలా మారిపోయింది. చెరువును ప్రజాప్రతి నిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరగడం వల్ల దుర్వా సన వెదజల్లుతోందని పలువురు వాపోతున్నారు. ఈ చెరువు నీటిని పలు వీధుల ప్రజలు వినియోగానికి, స్నానాలకు ఉపయోగించేవారు. కాని చెరువంతా మురుగు నీరుగా మారి దుర్వాసన రావడంతో ఎవరూ వాడడం లేదు. ఇప్పటికైనా అధికారు లు స్పందించి చెరువులో పూడికలు, మురుగు నీటిని తొలగించి వాడుకలోకి తీసు కురావాలని పలువురు కోరుతున్నారు.