Share News

నిర్వహణ లేక నిరుపయోగం

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:04 AM

: పలాస- కాశీ బుగ్గ మునిసిపల్‌ కార్యాలయంలో ఆవరణలో తడి పొడి చెత్త వాహనాలతో పాటు మంచినీటి ట్యాంకర్లు నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

నిర్వహణ లేక నిరుపయోగం
మూలకుచేరిన తడి,పొడి సేకరణ వాహనాలు

కాశీబుగ్గ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పలాస- కాశీ బుగ్గ మునిసిపల్‌ కార్యాలయంలో ఆవరణలో తడి పొడి చెత్త వాహనాలతో పాటు మంచినీటి ట్యాంకర్లు నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాలు దిష్టిబొమ్మల్లా మారాయి. మునిసి పాలిటీ పరిధిలో తడి,పొడి చెత్త సేకరణకోసం కొనుగోలు చేసిన ఏడు వాహనాలు నెలల తరబడి వినియెగంలో లేవు. ఇవి మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో నిరుపయోగంగా ఉండడంతో టైర్లతో పాటు వాహనాల్లో పార్టులు పాడవు తున్నాయి. అలాగే జంటపట్టణాల్లో నీటిఎద్దడి దృష్టిలో పెట్టుకొని లక్షలాది రూపాయలతో నీటి ట్యాంకర్లు కొనుగోలు చేశారు. వాటి వినియోగంపై కూడా మునిసిపల్‌ అధి కారుల పర్యవేక్షణ లేకపోవడంతో నీటి ట్యాంకులు పాడవుతున్నాయి. ఆ వాహనాలు తుప్పప డుతుండ గా టైర్లు పంచర్ల వుతున్నాయి. మార్చి నెలలోనే నీటి ఎద్దడి నెలకొంది. ఈ వాహనాలు వినియోగంలోకి తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:04 AM