Share News

మహేంద్రతనయలోకాలుష్యాన్ని అడ్డుకోవాలి

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:30 PM

: మండలంలోని అనేక గ్రామాలకు తాగునీటి వనరుగా ఉన్న మహేంద్ర తనయ నదీ జలాలు కాలుష్యం కాకుండా చూడాలని మండల సభ్యులు ముక్తకం ఠంతో కోరారు.

మహేంద్రతనయలోకాలుష్యాన్ని అడ్డుకోవాలి
అధికారులను ప్రశ్నిస్తున్న సభ్యులు

పాతపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మండ లంలోని అనేక గ్రామాలకు తాగునీటి వనరుగా ఉన్న మహేంద్ర తనయ నదీ జలాలు కాలుష్యం కాకుండా చూడాలని మండల సభ్యులు ముక్తకం ఠంతో కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వైస్‌ఎంపీపీ సవిరిగాన ప్రదీప్‌ అధ్యక్షతన మండల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ కొండాల యరకయ్య, సర్పంచ్‌ పడాల షణ్ముఖరావు తదితర సభ్యులు మాట్లాడుతూ.. పర్లాకిమిడి(ఒడిశా) నుంచి అత్యధిక శాతం మురుగునీరు, వ్యర్థాలు మహేంద్ర తనయనదిలో కలుస్తుండడంతో నీరు కలుషితం అవుతుందన్నారు. దీనికితోడు ఇటీవల పర్లాకిమిడిలో కొత్తగా నిర్మిస్తున్న మురుగు కాలువలను నేరుగా మహేంద్ర తనయ నదికి కలుపుతున్నారని, ఈ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. దీనిపై ఇరిగేషన్‌శాఖ అధికారులు మాట్లా డుతూ.. ఇప్పటికే కలెక్టర్‌, ఎమ్మెల్యే దృష్టిలో పెట్టిన ట్లు తెలిపారు. అభివృద్ధి పనుల శిలాఫలకాల్లో సర్పంచ్‌ల పేర్లు ఎందుకు పెట్టడం లేదని ఎంపీ టీసీ పోలాకి రేణుకతో పాటు పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. దీనిపై ఎంపీడీవో రమ ణమూర్తి స్పందిస్తూ.. ఇకనుంచి ఆ విధంగా జరగ కుండా చర్యలు చేపడతాపని హామీఇచ్చారు. గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకోవాలని, వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవా లని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో తహసీ ల్దార్‌ నందిగామ ప్రసాదరావు, వివిధ శాఖల అధి కారులు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 11:30 PM