సమష్టి కృషితో మహానాడు విజయవంతం: కలిశెట్టి
ABN , Publish Date - May 31 , 2026 | 11:50 PM
టీడీపీ మహానాడును కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషితో విజయవంతం చేశారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
రణస్థలం, మే 31 (ఆంధ్రజ్యోతి): టీడీపీ మహానాడును కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషితో విజయవంతం చేశారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాల యంలో పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. మహానాడును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత లు తెలిపారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు, నాయ కులకు సత్కరిం చారు. పార్టీ ముఖ్య నాయకులతో కలసి ఓటర్ సర్వే, స్పెషల్ ఇంటెన్సిన్ రివిజన్‌పై సమీ క్షించి వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి, సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ సీని యర్ నాయకులు చౌదరి బాబ్జి, లంక శ్యామలరావు, ముప్పిడి సురేష్, బెండు మల్లేశ్వరరావు, కొమరాపు రవి తదితరులు పాల్గొన్నారు.