Share News

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో మహదేవ్‌ ప్రతిభ

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:06 AM

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో హోంగార్డు ఎం.మహదేవ్‌ సంజీవరావు సిల్వర్‌ మెడల్‌ సాధించాడు.

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో మహదేవ్‌ ప్రతిభ
మహదేవ్‌ సంజీవరావును అభినందిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

సిల్వర్‌ మెడల్‌ సాధించిన హోంగార్డుకు ఎస్పీ అభినందన

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో హోంగార్డు ఎం.మహదేవ్‌ సంజీవరావు సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. రాజాం జీఎం ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 4, 5 తేదీల్లో 13వ ఏపీ స్టేట్‌ సబ్‌ జూని యర్‌, జూనియర్‌ అండ్‌ మాస్టర్స్‌ క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌-2026 పోటీలు నిర్వహిం చారు. ఈ పోటీల్లో జిల్లా పోలీసు శాఖకు చెందిన ఎం.మహదేవ్‌ సంజీవరావు మాస్టర్స్‌ విభాగంలో 83 కిలోల బాడీ వెయిట్‌ కేటగిరీలో స్క్వా ట్‌, డెడ్‌లిప్ట్‌, బెంచ్‌ ప్రెస్‌ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ద్వితీయ స్థానం సాధించి సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాల యంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మహ దేవ్‌ను అభినందించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో విజయం సాధించడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎ స్పీ శేషాద్రి, ఎస్‌బీ సీఐ ఇమాన్యూయేల్‌ రాజు, ఆర్‌ఐ శంకర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:06 AM