పిచ్చికుక్క స్వైరవిహారం
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:40 PM
Nine people were seriously injured టెక్కలి మండలం నర్శింగపల్లి, మొఖలింగాపురం పంచాయతీల పరిధిలో బుధవారం ఉదయం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి.. తొమ్మిదిమందిని తీవ్రంగా గాయపరిచింది.
- తొమ్మిది మందికి తీవ్రగాయాలు
- జిల్లా కేంద్రాసుపత్రిలో బాధితులకు చికిత్స
టెక్కలి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): టెక్కలి మండలం నర్శింగపల్లి, మొఖలింగాపురం పంచాయతీల పరిధిలో బుధవారం ఉదయం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి.. తొమ్మిదిమందిని తీవ్రంగా గాయపరిచింది. కిట్టాలపాడుకు చెందిన మోద అప్పారావు, మొఖలింగాపురం గ్రామానికి చెందిన లంకపాడు చిన్నోడు, నర్శింగపల్లికి చెందిన మిరపబెల్లి తవిటయ్య, సింగుపురం పాపారావు, రట్టి లక్ష్మణ, నాగారపు మణికంఠ, బొల్ల వల్లయ్య, కొల్లివలసకు చెందిన బమ్మిడి చంద్రరావుతోపాటు మరో వ్యక్తిపై దాడి చేసింది. దీంతో వారంతా గాయపడగా.. స్థానికులు, కుటుంబ సభ్యులు టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కుక్కకాటు బాధితులకు చికిత్స అందజేస్తున్నామని, ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదని డాక్టర్ మహరాజ్ తెలిపారు. అలాగే నందిగాం మండలం చిన్నలక్ష్మీపురంలో ఓ ఆవును కూడా పిచ్చికుక్క గాయపరిచింది. సుమారు ఆరు గ్రామాల పరిధిలో బుధవారం ఉదయం నుంచి పిచ్చికుక్క స్వైరవిహారంతో స్థానికులు భయాందోళన చెందారు. చివరికి కర్రలతో దాడి చేసి ఆ పిచ్చికుక్కను చంపేశారు.