పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:50 PM
జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శక వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శక వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్‌చంద్ర పునేఠా నిర్వ హించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అవ సరమైన సామగ్రి, బ్యాలెట్ బాక్సుల లభ్యతలో ఇబ్బందులు లేవని వివ రించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సంబంధించి, ప్రింటింగ్ ప్రెస్‌ల గుర్తింపు సహా అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలను ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు. తొలి విడతలో పోలింగ్ జరుగనున్న పంచాయతీల జాబితాను ఇప్పటికే సరిచూశామని చెప్పారు. ఏవైనా స్వల్ప మార్పులు ఉంటే, తదుపరి 24 గంటల్లోగా తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డీఆర్వో విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో ఆర్.వెంకట రామన్, డీపీవో స్వరూపరాణి పాల్గొన్నారు.