దారికాచి.. కర్రలతో దాడి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:08 AM
రొంపివలస గ్రామంలో (చిత్రిపేట) ఇరువర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలు మరోసారి బయటపడ్డాయి. చిత్రి విజయ్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, అలాగే కొరగాన లక్ష్మణరావు, జగదీష్ కుటుంబాలు ఏడాది కిందట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం గొడవలు పడ్డారు. ఆ గొడవలు నాడు పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. అది ఇప్పటికి చిలికిచిలికి గాలివానై మంగళవారం రాత్రి దాడి చేసే వరకు చేరింది.
రొంపివలసలో బయటపడిన పాతకక్షలు
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
గ్రామంలో పోలీసు పహారా
లావేరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రొంపివలస గ్రామంలో (చిత్రిపేట) ఇరువర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలు మరోసారి బయటపడ్డాయి. చిత్రి విజయ్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, అలాగే కొరగాన లక్ష్మణరావు, జగదీష్ కుటుంబాలు ఏడాది కిందట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం గొడవలు పడ్డారు. ఆ గొడవలు నాడు పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. అది ఇప్పటికి చిలికిచిలికి గాలివానై మంగళవారం రాత్రి దాడి చేసే వరకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రొంపివలసకు చెందిన చిత్రి శ్రీనివాసరావు పొందూరు సమీపంలో సామిల్లు నిర్వహి స్తున్నాడు. ఈయన మూడు రోజుల కిందట పొందూరు నుంచి పని ముగించుకుని రొంపివలసలోని తన ఇంటికి కారుతో వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొరగాన లక్ష్మణరావు తన ద్విచక్రవాహనంతో వెంబ డించాడు. దీంతో కారులో వెళ్తున్న శ్రీనివాస రావు ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు, కారు కింద పడితే ఏమౌతావని అడిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చిన్నపాటి తగాదా జరిగి అక్కడితో ఆగిపో యింది. దీన్ని మనసులో ఉంచుకున్న కొరగాన లక్ష్మణరావు, జగదీష్, నాగరాజు, లక్ష్మునాయుడు, ఉపేంద్ర కలిసి మంగళవారం గ్రామ సమీ పంలో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ను ఉంచి శ్రీనివాసరావు కారు ఆపి ఆయనపై కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో శ్రీనివాసరావు అన్నదమ్ములైన చిత్రి నాగేశ్వరరావు, బలరాం అదే దారిలో వస్తూ ఈ గొడవ చూశారు. వారిపై కూడా సదరు వ్యక్తులు కర్రలతో దాడికి పాల్ప డ్డారు. ఈ దాడిలో చిత్రి శ్రీనివాసరావుకు తలపైన, నాగేశ్వర రావుకు చేయి, కాలుకు, బలరాంకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో రొంపివలసలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో లావేరు, రణస్థలం ఎస్‌ఐలు కేఏ సూరి, ఎస్.చిరంజీవులు ఆధ్వర్యంలో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా చిత్రి శ్రీనివాసరావు సోదరుడు, మాజీ సర్పంచ్ భర్త చిత్రి విజయ్ గతంలో వైసీపీలో ఉంటూ ప్రస్తుతం టీడీపీలో చేరారు. అలాగే కొరగాన లక్ష్మణరావు, జగదీష్ కూడా గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడినవారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.