Share News

సందడే..సందడి

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:39 PM

నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం, ఎన్టీఆర్‌ ముసి పల్‌ హైస్కూల్‌, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలల్లో క్రీడా సందడి నెలకొంది. పలు విభాగాల క్రీడాకారు లతో క్రీడా మైదానాలు కళకళలాడాయి.

సందడే..సందడి
పరుగుపందెం పోటీలో పాల్గొన్న బాలికలు

ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు

కళకళలాడిన క్రీడా మైదానాలు

ఏడు క్రీడాంశాల్లో ఎస్‌జీఎఫ్‌ ఎంపికలు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం, ఎన్టీఆర్‌ ముసి పల్‌ హైస్కూల్‌, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలల్లో క్రీడా సందడి నెలకొంది. పలు విభాగాల క్రీడాకారు లతో క్రీడా మైదానాలు కళకళలాడాయి. రాష్ట్రస్థాయి పోటీల తేదీలు దగ్గర పడుతుండడంతో ఆ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికల పోటీలను శనివారం స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఏడు క్రీడాంశాల్లో జిల్లా నుంచి బాలురు, బాలికల జట్ల ఎంపికలు చేపడుతున్నారు. స్టేడియంతో పాటు ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఒకపక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ ను కనబరిచారు. స్టేడియంలో అండర్‌-14 బాలురు, బాలికల ఖోఖో, అండర్‌-17, 19 బాల బాలికలకు అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు.

అండర్‌-14, 17, 19 విభాగాల్లో హ్యాండ్‌బాల్‌ పోటీలో ఎంపికలు జరిగాయి. మూడు ఏజ్‌ గ్రూపులకు యోగా ఎంపికలను పూర్తి చేశారు. ప్రభుత్వ పురు షుల డిగ్రీ కళాశాలలో అండర్‌- 17 క్రికెట్‌, అండర్‌-14 వాలీబాల్‌ బాలురు, బాలికల ఎంపికలు జరిగాయి. స్కూల్‌గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సీహెచ్‌ జగదీష్‌ పర్యవేక్షణలో ఈ పోటీలకు జిల్లా వ్యాయామ ఉపాధ్యా య సంఘం ప్రతినిధులు సహకరించారు.

Updated Date - Oct 24 , 2026 | 11:39 PM