అదుపు తప్పి.. రక్షణ గోడను ఢీకొట్టి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:05 AM
సీతంపేట ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్ రెండో మలుపు వద్ద ఆటో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో డ్రైవర్ మృతిచెందాడు. ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి.
సీతంపేట రూరల్, జనవరి18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్ రెండో మలుపు వద్ద ఆటో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో డ్రైవర్ మృతిచెందాడు. ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి. సీతంపేట ఎస్‌ఐ అమ్మనరావు కథనం మేరకు.. మెళియాపుట్టి మండలంలోని వసుందరకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు బోయిన సురేష్‌కుమార్, బి.శ్రీజ, లాస్య, మౌనిక, రా జేష్, సందీప్‌లు ఆదివారం కొసమాలకి చెందిన ముళ్లి చందర్రావు ఆటోను బుక్ చేసుకొని ఆడలి వ్యూపాయింట్‌కు వచ్చారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకించి సరదాగా గడిపారు. సాయంత్రం వ్యూపాయింట్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఘాట్‌రోడ్డు దిగుతుండగా బిడిందిగూడ మలుపు వద్ద ఆటో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొంది. దీంతో గాయపడిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో 108లో సీతం పేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని పరిశీలించగా అప్పటికే ఆటోడ్రైవర్ చంద్రరావు(39)మృతిచెందినట్లు నిర్ధారించారు. మి గిలిన వారికి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం సురేష్ కుమార్, శ్రీజ, లాస్య, మౌనిక, సందీప్‌లను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు రాజేష్ పరిస్థితి నిలకడగా ఉండడంతో సీతంపేట ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదం విషయం తెలుసు కున్న ఎస్‌ఐ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్య లు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలి పారు. ఆటో డ్రైవర్‌కు భార్య, కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.