Share News

విద్యుదాఘాతంతో లారీ క్లీనర్‌ మృతి

ABN , Publish Date - May 07 , 2026 | 12:33 AM

కొత్తూరు మండలం నివగాం గ్రామంలోని ఓ రైస్‌మిల్లు వద్ద బుధవారం జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ఆమ దాలవలస మండలం అక్కులపేట గ్రామానికి చెందిన ఊకలారీ క్లీనర్‌ అంజి (30) మృతి చెందినట్టు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

విద్యుదాఘాతంతో లారీ క్లీనర్‌ మృతి

మెళియాపుట్టి(కొత్తూరు), మే 6(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం నివగాం గ్రామంలోని ఓ రైస్‌మిల్లు వద్ద బుధవారం జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ఆమ దాలవలస మండలం అక్కులపేట గ్రామానికి చెందిన ఊకలారీ క్లీనర్‌ అంజి (30) మృతి చెందినట్టు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. నివగాంలో ఉన్న సాయిరాం రైస్‌మిల్లుకు ఊకలారీ లోడింగ్‌ కోసమై వ చ్చింది. డ్రైవర్‌ ఈశ్వరరావుతోపాటు క్లీనర్‌ అంజి లారీలో ఉన్నారు. ఊక లోడింగ్‌ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే క్రమంలో మిల్లుగేటు వద్ద ఉన్న విద్యుత్‌ వైర్లు లారీకి తగిలే ప్రమాదం ఉండడంతో అంజి కర్రతో పైకి ఎత్తుతుండగా వి ద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతిచెందాడు. లారీలో ఉన్న డ్రైవర్‌ ఈశ్వర రావు అప్రమత్తమై కిందకి దిగుతుండగా అతడు కూడా విద్యుత్‌ షాక్‌కు గురై గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స కోసం కొత్తూరు సీహెచ్‌ిసీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జలుమూరు (సారవకోట), మే 6(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి మండలం రేగులపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన పొట్నూరు బాలకృష్ణ కోటబొమ్మాళి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండ గా.. రేగులపాడు వద్ద ట్రాక్టరును వెనుక నుంచి ఢీకొ ట్టాడు. దీంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణకు భార్య, తల్లిదండ్రులు రాణి, గోవిందరావు ఉన్నారు. బాలకృష్ణ టెక్కలిలోని ఓ మెడికల్‌ షాపులో పనిచేస్తున్నాడు. కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వృద్ధుడు..

మెళియాపుట్టి, మే 6(ఆంధ్రజ్యో తి): బురదరామచంద్రపురం జం క్షన్‌ వద్ద జరిగన రోడ్డు ప్రమా దంలో గుర్తుతెలియని వృద్ధుడు చెందినట్టు ఎస్‌ఐ అమీర్‌ ఆలీ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మెళియాపుట్టి- పలాస రోడ్డులో మంగళవారం రాత్రి బురదరామచంద్రపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొన డంతో ఆ వృద్ధుడు మృతి చెంద డంతో రోడ్డు పక్కన పడేశారు. అ యితే బుధవారం అటుగా వెళ్లిన కొంతమంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగిన అనవాళ్లను గుర్తించారు. మృతి చెందిన వృద్ధుడి వృద్ధుడి వయస్సు సుమారు 70 ఏళ్లు ఉండొచ్చని గుర్తించారు. తెల్లని బనియన్‌తో పాటు లుంగి, తువ్వాలు ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 07 , 2026 | 12:33 AM