Share News

రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో లోకేశ్‌ది కీలకపాత్ర

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:44 AM

Happy birthday to Lokesh రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో మంత్రి నారా లోకేశ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్‌ భవనంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన లోకేశ్‌ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో లోకేశ్‌ది కీలకపాత్ర
రోగులకు పండ్లు, రొట్టెలు అందిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ఘనంగా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

కోటబొమ్మాళి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో మంత్రి నారా లోకేశ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్‌ భవనంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన లోకేశ్‌ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అలాగే స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రోగులకు, రొట్టెలు, పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘ఆధునిక రాజకీయాలకు కొత్తదిశ చూపుతున్న యువనాయుడు మంత్రి లోకేశ్‌. పేరు కంటే పనితో రాజకీయ స్థానాన్ని సుస్తిరం చేసుకున్నారు. ముఖ్యంగా యువత ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నార’ని తెలిపారు. అలాగే ప్రజాదర్బార్‌లో వస్తున్న ప్రతి సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్‌ భవనంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ వెలమల విజయలక్ష్మి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీ బోయిన రమేష్‌, పూజారి శైలజ, బాడాన రమణమ్మ, తర్ర రామకృష్ణ, నంబాళ క్షనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:44 AM