Share News

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:27 AM

నరసన్నపేట పట్టణంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక సాయినగర్‌లో సడగాన సావిత్రమ్మ ఇంటి తాళాలను పగలుగొట్టి చొరపడ్డారు.

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌

  • నరసన్నపేటలో దొంగలు హల్‌చల్‌

నరసన్నపేట, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక సాయినగర్‌లో సడగాన సావిత్రమ్మ ఇంటి తాళాలను పగలుగొట్టి చొరపడ్డారు. ఇంట్లో బీరువాలను, ఇతర వస్తువులు చిందర వందర చేశారు. అయితే సావిత్రమ్మ ఇంట్లో విలువైన వస్తువులు లేకపోవడంతో చిందరవందర చేసిన దొంగులు వెనుతిరిగారు. పగటి సమయంలో వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో టార్గెట్‌ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన ఇంటిని శ్రీకాకుళం నుంచి వచ్చిన క్లూస్‌ టీం ఆధారాలు సేకరించారు. పట్టణంలో రాత్రి సమయంలో గస్తీ పెంచినా దొంగలు హల్‌చల్‌ చేయడంపై పోలీసులు కొత్త వ్యక్తులు కదిలికలపై దృష్టి సారించారు. ఎస్‌ఐ గణేష్‌ చోరీకి యత్నించిన ఇంటిని పరిశీలించారు.

కోవిలాం కాలనీలో..

ఎల్‌ఎన్‌ పేట, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కోవిలాం కాలనీలోని రెండిళ్లు తాళాలను పగు లుగొట్టిన దొంగలు వెండి వస్తువులను పట్టు కు పోయారు. స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. అన్నదమ్ము లైన జావాపు సింహాచలం, వెంకటరావు ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. వీరు ఉపాధికోసం కు టుంబాలతో విజయవాడ వెళ్లిపోయారు. ఇం టిలో ఎవరూలేరన్న విషయాన్ని తెలుసుకున్న దొంగలు తాళాలు పగుల గొట్టి చోరీకి పాల్ప డ్డారు. వెంకటరావు ఇంటిలో దీపంపెట్టుకొనే వెండి వస్తువులను పట్టుకుపోయారు. విజ యవాడ నుంచి బాధిత కుటుంబీకులు సింహాచలం, వెంకటరావు హిరమండలం మండలంలో తమ బంధువులు ఇంటికి పరామర్శకోసం మంగళవారం స్వగ్రామానికి వచ్చి చూసేసరికి ఇళ్ల తాళాలు పగలుగొట్టి ఉండడాన్ని గుర్తించారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని సరుబుజ్జిలి ఎస్‌ఐ సీహెచ్‌ చిరంజీవి తెలిపారు.

Updated Date - Oct 08 , 2026 | 12:27 AM