స్నాక్స్‌లో బల్లి!
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:34 AM
Lizard found in snacks at Ekalavya School మెళియాపుట్టిలోని ఏకలవ్య పాఠశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థులకు ఉడకబెట్టిన శనగలు స్నాక్స్‌గా ఇచ్చారు. అందులో ఓ బల్లి పడగా.. సిబ్బంది గమనించి పక్కకు తీసి పడేశారు. కాగా.. ఆ స్నాక్స్ తిన్న ఓ విద్యార్థి వాంతులు చేసుకోవడంతో టెక్కలిలోని ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించినట్టు తెలుస్తోంది.
మెళియాపుట్టి ఏకలవ్య పాఠశాలలో ఘటన
విద్యార్థులకు తప్పిన ముప్పు
మెళియాపుట్టి, జూలై 23(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టిలోని ఏకలవ్య పాఠశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థులకు ఉడకబెట్టిన శనగలు స్నాక్స్‌గా ఇచ్చారు. అందులో ఓ బల్లి పడగా.. సిబ్బంది గమనించి పక్కకు తీసి పడేశారు. కాగా.. ఆ స్నాక్స్ తిన్న ఓ విద్యార్థి వాంతులు చేసుకోవడంతో టెక్కలిలోని ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించినట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు ఉన్నారు. స్నాక్స్‌లో బల్లి పడిన వెంటనే తీసి పక్కన పడేశామని సిబ్బంది చెబుతున్నారు. ఆ స్నాక్స్ విద్యార్థులకు పెట్టలేదన్నారు. కాగా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో చికెన్ కూరలో కూడా బొద్దింక పడినట్టు తమ దృష్టికి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మోహనరావు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఏకలవ్య పాఠశాలల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఐటీడీఏ డీడీ అన్నాదొర వద్ద ప్రస్తావించగా.. స్నాక్స్‌లో బల్లిపడిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. పాఠశాలను పరిశీలించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.