డ్రగ్స్‌తో జీవితాలు ఛిద్రం
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:32 PM
మత్తుపదార్థాలకు అలవాటు పడితే జీవితాలు ఛిద్రమవుతాయని, వీటికి దూరంగా ఉండాలని ఆరో అదనపు జిల్లా న్యాయాధికారి కోడూరు కిశోర్‌బాబు అన్నారు.
ఆరో అదనపు జిల్లా న్యాయాధికారి కిశోర్‌బాబు
సోంపేట, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మత్తుపదార్థాలకు అలవాటు పడితే జీవితాలు ఛిద్రమవుతాయని, వీటికి దూరంగా ఉండాలని ఆరో అదనపు జిల్లా న్యాయాధికారి కోడూరు కిశోర్‌బాబు అన్నారు. స్థానిక మోడల్ పాఠశాలలో మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తుపదార్థాలకు అలవాటు పడిని వారు మరొకరికి అలవాటు చేస్తున్నారని, అందువల్ల స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండా లని కోరారు. సమావేశంలో ప్రిన్సిపాల్ చిన్నాజీ వర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీఎస్ శైలీంద్ర, న్యాయవాదులు ఎం.సర్వేశ్వరరావు, కె.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం రూరల్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్ పొందాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు అన్నారు. నేషనల్ యూత్ డే వారోత్సవాల్లో భాగంగా గురువారం చింతాడ గ్రామంలో కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి నేటితరం యువ తను దారి మళ్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి దూరంగా ఉండి దేశాభి వృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌వీవీ వేణుగోపాల్, ఆర్‌రాజారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.