Share News

రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:05 AM

రక్తదానం చేయడం ద్వారా తలసీమియాతో బాధిత చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు అన్నారు.

రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు
రక్తదానం చేస్తున్న ఏపీజీబీ ఉద్యోగులు

రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ జగన్మోహనరావు

ఏపీజీబీ ఉద్యోగుల రక్తదానం

శ్రీకాకుళం కల్చరల్‌/పాతశ్రీకాకుళం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రక్తదానం చేయడం ద్వారా తలసీమియాతో బాధిత చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు అన్నారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్స వాల్లో భాగంగా ఏపీ గ్రామీణ బ్యాంకు శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించా రు. బ్యాంకు ప్రాంతీయ మేనేజర్‌ డి.రామ కృష్ణరాజుతో కలిసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన రావు మాట్లాడుతూ.. రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీ యమ న్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. కార్యక్రమంలో బ్యాంకు సీనియర్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నందినీ సాహు, రెడ్‌క్రాస్‌ సిబ్బంది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:05 AM