‘అక్టోబరు 10, 11 తేదీల్లో సాహితీ సమ్మేళనం’
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:08 AM
విశాఖపట్నం అల్లూరి సీతా రామరాజు విజ్ఞాన కేంద్రం లో అక్టోబరు 10, 11 తేదీల్లో ఆరు జిల్లాల సాహితీ సమ్మేళనం నిర్వహించను న్నట్లు రచయితలు అట్టాడ అప్పలనాయుడు, నల్లి ధర్మారావు తెలిపారు.
శ్రీకాకుళం కల్చరల్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం అల్లూరి సీతా రామరాజు విజ్ఞాన కేంద్రం లో అక్టోబరు 10, 11 తేదీల్లో ఆరు జిల్లాల సాహితీ సమ్మేళనం నిర్వహించను న్నట్లు రచయితలు అట్టాడ అప్పలనాయుడు, నల్లి ధర్మారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరంలోని యూటీఎఫ్ భవ నంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. కవిత్వం, కథ, పాట ఈ మూడు విభాగాల్లోనూ సమ్మేళనం జరుగుతుంద న్నారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ సాహితీ ప్రక్రియను యువ రచయితలకు మార్గ నిర్దేశం చేసేందుకు ఈ సాహితీ సమ్మేళనం దోహ దం చేస్తుందన్నారు. సమాజం ఎదరుర్కొంటున్న ఆర్థిక, సాంస్కృతిక సవాళ్లను స్వీక రించి రచయితలు ప్రజల పక్షాన నిలవాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి కార్యదర్శి కేతవరపు శ్రీనివాసరావు, కథానిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, విశ్వ సాహితీ ప్రధాన కార్యదర్శి కర్నేన జనార్దన రావు, ఎం.ప్రభాకరరావు, పి.సుధాకర్, నెట్టిమి రమణారావు తదితరులు పాల్గొన్నారు.