Share News

బాధలు వింటూ.. భరోసా కల్పిస్తూ

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:49 PM

టీడీపీ జిల్లా కార్యా లయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతులు స్వీకరించారు.

బాధలు వింటూ.. భరోసా కల్పిస్తూ
ప్రజాదర్బార్‌లో అర్జీదారుల సమస్యలు వింటున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

అరసవల్లి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా కార్యా లయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది తరలివచ్చారు. వారు ఇచ్చే వినతులను తీసుకుని ఓపి కగా సమస్యలను వింటూ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ.. పరిష్కారానికిచర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన గ్రీవెన్స్‌ మధ్యా హ్నం 2 గంటల వరకు కొనసాగింది. భోజన విరామం అనం తరం మళ్లీ ప్రారంభించారు.

‘సైన్‌ లాంగ్వేజ్‌తో బధిరులకు భరోసా’

బధిరులతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సైన్‌ లాంగ్వేజ్‌ను నేర్చుకుని వారికి భరోసా ఇవ్వాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. ఈ సంద ర్భంగా చెవిటి, మూగ వారితో సంభాషణకు వీలుగా ఉండే చేతి సంజ్ఞల భాష సైన్‌ లాంగ్వేజ్‌ పోస్టర్లను శనివారం ఆవి ష్కరించారు. ఇంగ్లీషు అక్షరాలతోపాటు నిత్యావసరాలను తెలి పే చేతి సంజ్ఞలతో పోస్టర్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా బధిరుల అసోసియేషన్‌ అడ్వైజర్‌ నర్మజ, ప్రతినిధులు సురేష్‌, దేవి, కిరణ్‌, ప్రసాద్‌, దివ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులకు రెట్టింపు పరిహారం ఇవ్వాలి

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రైల్వేశాఖ భువనే శ్వర్‌ నుంచి విశాఖపట్నం వరకు కొత్తగా తూర్పు వైపు మూడో లైన్‌ ఏర్పాటుకు అవసరమైన జిరాయితీ భూములను సేకరిస్తున్నందున వారికి రెట్టింపు పరిహారం అందించాలని జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస రౌళో కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రా మ్మోహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. సారవంతమైన భూము లున్నాయని, అలాగే జీడి, కొబ్బరి, మామిడి తోటలు వంటి వాణిజ్య ఉద్యాన పంటలను పండిస్తున్నారన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. రైతులకు అన్యాయం జరగదని అందరికీ న్యాయం చేయి స్తామని పేర్కొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:50 PM