సరిహద్దు గ్రామాలలో సారా స్వాధీనం
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:52 PM
ఆంధ్ర- ఒడిశా సరిహద్దులోని గ్రామాలలో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా దాడులు చేసినట్టు సీఐ కోట కృష్ణారావు తెలిపారు.
పాతపట్నం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర- ఒడిశా సరిహద్దులోని గ్రామాలలో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా దాడులు చేసినట్టు సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ దాడులలో రూ.2.50 లక్షల విలువచేసే 3,300లీటర్ల పులిసిన బెల్లాన్ని ధ్వంసం చేశామన్నారు. 370 లీటర్ల నాటుసారాను స్వాధీన ం చేసుకున్నట్టు తెలిపారు. మూడు కేసులు నమోదు చేసి ఒకవ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్లు ఆయన తెలిపారు.