నగిరికటకంలో పిడుగుపాటు
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:04 AM
Eight goats dead నగిరికటకం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడి ఎనిమిది మూగ జీవాలు మృతి చెందాయి. నగిరికటకం గ్రామానికి చెందిన వనుము బారికివాడు, డక్కరి సింహాచలం, నాసరి లక్ష్మణ్ ఆదివారం మధ్యాహ్నం గొర్రెల మందను నీళ్ల కోసం వంశధార నది వద్దకు తరలించారు.
ఎనిమిది మూగజీవాలు మృతి
జలుమూరు, జూన్ 14(ఆంధ్రజ్యోతి): నగిరికటకం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడి ఎనిమిది మూగ జీవాలు మృతి చెందాయి. నగిరికటకం గ్రామానికి చెందిన వనుము బారికివాడు, డక్కరి సింహాచలం, నాసరి లక్ష్మణ్ ఆదివారం మధ్యాహ్నం గొర్రెల మందను నీళ్ల కోసం వంశధార నది వద్దకు తరలించారు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో బారికివాడుకి సంబంధించిన నాలుగు మేకలు, డక్కరి సింహాచలంకు చెందిన రెండు గొర్రెలు, నాసరి లక్ష్మణ్‌కు చెందిన ఒక గొర్రె, ఒక మేక మృతిచెందాయి. ఆ ముగ్గురూ తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని లబోదిబోమన్నారు. సమాచారం తెలుసుకున్న పశు వైద్యాధికారి ముద్దాడ దీప్తి ఘటనా స్థలానికి చేరుకొని మూగజీవాలను పరిశీలించారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం పాతిపెట్టించారు. మృతిచెందిన జీవాలకు బీమా సౌకర్యం కల్పించి బాధితులను ఆదుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.