Share News

ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేయాలి

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:05 AM

కొండపేట ఎత్తిపోతల పథకం మర మ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్‌ చేశారు.

ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేయాలి
జగన్నాఽథపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు, రైతులు

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): కొండపేట ఎత్తిపోతల పథకం మర మ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం జగన్నాఽథపురంలో రైతులతో కలిసి సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వ హించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కొండపేట ఎత్తిపోతల పథకం మర మ్మతులకు నోచుకోకపోవడంతో 22 గ్రామాల్లో 2.500 ఎకరాలకు నీరందడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు, రైతులు సనపల నారాయణరావు, గుంట అప్పన్న, సనపల నరసిం హులు, గజపతి, గుంట రూపావతి పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:05 AM