Share News

పొలంలోనే ఆగిన ఊపిరి

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:17 AM

Farmer dies after being struck by lightning పొలంలోనే ఆ రైతు ఊపిరి ఆగింది. పిడుగుపా టుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఉద్దాన గోపినాథపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్ని గణేష్‌ (55 ) ఆనే రైతు శనివారం సాయంత్రం తన వరి పొలాన్ని చూసేందుకు వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా ఆ సమయంలో వర్షంతో పాటు పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పొలంలోనే ఆగిన ఊపిరి
గణేష్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

పిడుగుపడి రైతు మృతి

వజ్రపుకొత్తూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పొలంలోనే ఆ రైతు ఊపిరి ఆగింది. పిడుగుపా టుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఉద్దాన గోపినాథపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్ని గణేష్‌ (55 ) ఆనే రైతు శనివారం సాయంత్రం తన వరి పొలాన్ని చూసేందుకు వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా ఆ సమయంలో వర్షంతో పాటు పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెళ్లి పొలంలో అచేతనంగా పడిఉన్న గణేష్‌ను ఒడ్డుకు తెచ్చి సపర్యలు చేశారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు గుర్తించి బోరున విలపించారు. అందరితో కలుపుగోలుగా ఉండే గణేష్‌ను పిడుగు రూపంలో మృత్యువు కబళించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గణే ష్‌కు భార్య చంద్రమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ అప్పలరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎమ్మెల్యే శిరీష విచారం

పిడుగుపడి రైతు గణేష్‌ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. అగ్నికులక్షత్రియ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కర్ని రమణ మృతుని కుటుంబాన్ని ఓదార్చారు.

Updated Date - Oct 04 , 2026 | 12:17 AM