Share News

మనఊరు బడిని రక్షించుకుందాం

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:51 PM

మన ఊరుబడిని పరిరక్షించే బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని జిల్లా విద్యాశాధికారి రవిబాబు అన్నారు.

మనఊరు బడిని రక్షించుకుందాం
ర్యాలీలో పాల్గొన్న డీఈవో రవిబాబు తదితరులు

  • జిల్లా విద్యాశాధికారి రవిబాబు

నరసన్నపేట, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): మన ఊరుబడిని పరిరక్షించే బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని జిల్లా విద్యాశాధికారి రవిబాబు అన్నారు. శనివారం సత్యవరం గ్రామంలో నిర్వహించిన బడిపిలిస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. ప్రభుత్వ పాఠశాలలో చేరితే మానసిక వికాసం పెరుగుతుందని, ఒత్తిడి లేని చదువులు ఎంతో ఆరోగ్యాన్ని పెంచుతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు, హెచ్‌ఎంలు ఓకులా రత్నమాల, అప్పలనాయుడు, ఉపాధ్యాయులు కేశవరావు, లీలారాణి, లక్ష్మణరావు, రంధి అప్పారావు, పద్మజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:51 PM