హక్కుల సాధనకు సమష్టిగా పోరాడుదాం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:10 AM
కార్మికుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడుదామని మునిసిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిల్ల సుబ్బారాయుడు పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం అర్బన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కార్మికుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడుదామని మునిసిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిల్ల సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళంలోని మునిసిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈనెల 16, 17, 18 తేదీల్లో రాజమండ్రిలో జరిగే రా ష్ట్ర మహాసభలు జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో మునిసిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె.వేణుగోపాలరావు, కళ్యాణి అప్పలరాజు, నాయకులు గురుమూర్తి, పార్థసారధి, గణేష్, మణి, రామచంద్ర, గణేష్, గౌతంరాజు, గురుస్వామి, సురేష్, సీతమ్మ, సూర్యకళ పాల్గొన్నారు.
‘పారిశుఽధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’
శ్రీకాకుళం రిమ్స్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో 24 మంది పారిశుధ్య కార్మికులు ఆరునెలలుగా జీతభత్యాలు, పని భద్రత కోసం పోరాడుతున్నా సమస్యను పరిష్కరించలేదని, కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారని ఇఫ్టూ నాయకురాలు సవలాపురపు కృష్ణవేణి ఆరోపించారు. ఈ మేరకు రిమ్స్ ఆవరణలో పారిశుధ్య కార్మికులు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విఽధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఐదురోజులుగా ఆసుపత్రి ఆవరణ లోనే నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని, వేతనాలు చెల్లించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో డి.చిన్నారావు, సాధు శ్రీనివాసరావు, కొప్పుల రాజశేఖర్, విజయకావ్య, నీలవేణి, సరస్వతి, పార్వతి పాల్గొన్నారు.