Share News

ఐక్యంగా పోరాడుతాం

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:40 AM

తమకు న్యాయం చేయకుంటే ఐక్యంగా పోరాడుతామని నందిగాం మండలంలోని గిరిజనులు స్పష్టంచేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఎస్టీలను తక్కువచేసి మాట్లాడడం తగదని పేర్కొన్నారు.

  ఐక్యంగా పోరాడుతాం
సవరబడగాంలో నిరసన తెలుపుతున్న గిరిజనులు:

నందిగాం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): తమకు న్యాయం చేయకుంటే ఐక్యంగా పోరాడుతామని నందిగాం మండలంలోని గిరిజనులు స్పష్టంచేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఎస్టీలను తక్కువచేసి మాట్లాడడం తగదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేదని గిరిజన ప్రతినిధులు ఎస్‌.కోదండరావు, సవర నాగేశ్వరరావు, ఢిల్లేశ్వరరావు, రామ్మూర్తి, అప్పన్నలు పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం మండలంలోని సవరబడగాంలో సవరబడగాం, ముకుందాపురం, ఇసంపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు ఎమ్మెల్యే తమపై చేసిన విమర్శలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ హక్కులను కాలరాయడం సరికాదన్నారు. ఆర్టికల్‌ 342 ప్రకారం గిరిజనేతరులను గిరిజన జాబితాలో చేర్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని స్పష్టం చేశారు.

Updated Date - Mar 31 , 2026 | 12:40 AM