Share News

‘ఉమ్మడిగా పోరాడుదాం’

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:43 AM

పోర్టు అనుబంధ ఇండస్ట్రియల్‌ పార్కు కోసం ప్రభుత్వం భూములు తీసుకుంటుందనే ప్రచారంతో శుక్రవారం టెక్కలి మేజర్‌పంచాయతీ గోపీనాథపురం, చేరివీధి ప్రాంతాల్లో జనజాగృతి సమా వేశాలు నిర్వహించారు.

‘ఉమ్మడిగా పోరాడుదాం’
గోపీనాథపురంలో ఆందోళన చేస్తున్న రైతులు

టెక్కలి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): పోర్టు అనుబంధ ఇండస్ట్రియల్‌ పార్కు కోసం ప్రభుత్వం భూములు తీసుకుంటుందనే ప్రచారంతో శుక్రవారం టెక్కలి మేజర్‌పంచాయతీ గోపీనాథపురం, చేరివీధి ప్రాంతాల్లో జనజాగృతి సమా వేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ బతుకు తెరువు కోసం ఉమ్మడిగా నిలిచి పోరాడాలని నిర్ణయించారు. ఇప్పటికే పోర్టు రోడ్డు నిర్మాణం కోసం కొంత భూములు త్యాగం చేయాల్సి వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో గండి ఉపేంద్రరెడ్డి, సత్తారు సత్యం, మోదుగువలస గణపతి రావు, వట్టికూళ్ల రామకృష్ణ, సనపల మురళి, వట్టికూళ్ల ఢిల్లేశ్వరరావు, నంబూరు షన్ముఖరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 12:43 AM