గంజాయిని నిర్మూలిద్దాం
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:34 AM
The Abhyudayam Cycle Tour has concluded ‘గంజా యి మత్తులో పడి భవిష్యత్‌ను నాశనం చేసుకో వద్దు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల’ని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. శనివారం ఇచ్ఛాపురంలో నిర్వ హించిన ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’లో ఆమె పాల్గొన్నారు.
హోంమంత్రి అనిత
ఇచ్ఛాపురంలో ముగిసిన అభ్యుదయం సైకిల్ యాత్ర
ఇచ్ఛాపురం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘గంజా యి మత్తులో పడి భవిష్యత్‌ను నాశనం చేసుకో వద్దు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల’ని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. శనివారం ఇచ్ఛాపురంలో నిర్వ హించిన ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’లో ఆమె పాల్గొన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఐజీ గోపీనాథ్ జట్టి, విప్ బెందాళం అశోక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలి సి ఉత్సాహంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో’ ర్యాలీ చేపట్టారు. హోంమంత్రి అనిత స్కూటీపై, మిగిలిన వారంతా సైకిళ్లు తొక్కుతూ ముందుకు కదిలారు. అనంత రం సురంగిరాజా మైదానంలో నిర్వహించిన సభ లో హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ‘గంజాయి రహిత రాష్ట్రమే సీఎం చంద్రబాబు లక్ష్యం. అం దులో భాగంగానే పాయకరాపుపేట నుంచి ఇచ్ఛా పురం వరకు అభ్యుదయం సైకిల్‌యాత్ర చేప ట్టాం. డ్రగ్స్ వద్దురా బ్రో అనే నినాదంతో అభ్యుద యం సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టిన ఐజీ గోపీనాథ్ జట్టికి ప్రత్యేక ధన్యవాదాలు. గంజాయి నిర్మూలనకు ఈగల్ క్లబ్ ఐజీ రవికృష్ణ అవగా హన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. ఈ యాత్ర ఇచ్ఛాపురంలో ముగియడం ఎంతో ఆనందంగా ఉంది. నేనూ ఇచ్ఛాపురం ఆడబిడ్డనే. డ్రగ్స్ నిర్మూలనకు ఇచ్ఛాపురం నాంది పలకాలి. ఒడిశా నుంచి గంజాయి మొక్క కాదు కదా.. ఆకు తీసుకురావాలన్నా భయపడేలా చేయాలి. ఆంధ్రా - ఒడిశా బోర్డర్‌లో చెక్‌పోస్టుల వద్ద నిఘా మరింత పెంచాలి. గంజాయి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాల’ని స్పష్టం చేశారు.
గంజాయిపై ఉక్కుపాదం: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయికి కేపిటల్‌గా మార్చేసిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గంజాయిపై ఉక్కుపాదం మోపిందని తెలిపారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే సంకల్పం అందరిలో ఉండాలన్నారు. ‘గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మత్తు మందు వ్యాపారాలకు నిలయంగా మారింది. దీనివల్ల యువత చాలా నష్టపోయింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపడుతోంది. వాటి మూలాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. మొదటి సారిగా గిరిజన ప్రాంతాల్లో, మానవులు, వాహనాలు వెల్లలేని ప్రాంతాల్లో సైతం డ్రోన్ కెమెరాల సహాయంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నాం. అక్కడ గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలో 18నెలల్లో 53వేల కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతీ ఒక్క యువకుడు ధైర్యంతో.. ఆరోగ్యంగా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి’ అని రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు డ్రగ్స్‌పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అభ్యుదయ సైకిల్ యాత్రికులకు శాలువలతో సత్కరించారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుతాం: ప్రభుత్వ విప్ అశోక్
డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చుదిద్దుతామని ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువయ్యిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తుందని తెలిపారు. ఈగల్ వ్యవస్థ 53వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుందన్నారు. గంజాయిపై 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇచ్చే వారిపేర్లను గోప్యంగా ఉంచుతారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, ఐజీ గోపినాథ్ జట్టి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఈగల్ ఐజీ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత, అభ్యుదయ సైకిల్‌యాత్ర సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.