ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు కృషి చేద్దాం: ఎంపీ, ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:53 PM
పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు.
రణస్థలం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో శనివారం వెంకటరావుపేటలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టారు. పరి శుభ్రత ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కలిగించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. స్వచ్ఛాంధ్రలో భాగస్వాములవుదామంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పిషిని జగన్నాథం నాయుడు, లంక శ్యామలరావు, మైలపల్లి పోలీస్, ఎంపీడీవో ఎస్. ఈశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, ఏఈ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.