‘ఏచూరి’ ఆశయాలను సాధిద్దాం: సీపీఎం
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:00 PM
:సీపీఎం ఆలిండియా మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.మోహన్‌రావు పిలుపునిచ్చారు.
కాశీబుగ్గ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):సీపీఎం ఆలిండియా మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.మోహన్‌రావు పిలుపునిచ్చారు. శనివారం కాశీబుగ్గ లోని సీపీఎం కార్యాలయంలో ఏచూరి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నీతి,నిజాయితీకి నిలువెత్తూ నిదర్శనం ఏచూరి అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిపై పోరాడడమే ఏచూరికి ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గణపతి, నాయకులు అజయ్‌కుమార్, దిలీప్‌కుమార్, రాజు, లక్ష్మీనారాయణ, ధర్మారావు పాల్గొన్నారు.
టెక్కలిలో..
టెక్కలి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఉద్య మాల ఘని కామ్రేడ్ సీతా రాం ఏచూరి అని సీఐటీ యూ నాయకుడు కొల్లి ఎల్లయ్య అన్నారు. శనివా రం సీఐటీయూ కార్యాల యంలో ఏచూరి వర్థంతిని నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొని విప్లవం కోసం పనిచేస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా తన జీవితాన్ని ప్రజా పోరాటా లకు, దేశ ప్రగతికి అంకితం చేశారన్నారు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో అరుదని అన్నారు. ఈ సమావేశంలో ఈశ్వరరావు, కామేశ్వరరావు, వాసుదేవ రావు, దుర్గాప్రసాద్, లక్ష్మణ, వైకుంఠరావు పాల్గొన్నారు.