ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమిద్దాం
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:09 AM
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.తులసీదాస్ పిలుపునిచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తులసీదాస్
అరసవల్లి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.తులసీదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద సీపీఎం, సీపీఐ ఆధ్వర్యం లో బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మా ట్లాడారు. ఇటీవల జరిగిన స్థా నిక సంస్థల ఎన్నికల్లో పోలీసు లు, గూండాల పాత్ర ఎక్కు వైందని ఆరోపించారు. దాడులు, దౌర్జన్యాలతో అభ్యర్థులను, ఏజెం ట్లను భయపెట్టి, నిర్బంధించి, రిగ్గింగ్ చేశారని, అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించా లని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో సీపీఎం అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, నాయకులు కొన్న శ్రీనివాస్, చిక్కాల గోవిందరావు, బి.కృష్ణ మూర్తి, కె.మోహనరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.