పూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:48 PM
సామాజిక సమానత్వం కోసం పరితపించిన పూలే ఆశయాలను స్ఫూర్తి గా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): సామాజిక సమానత్వం కోసం పరితపించిన పూలే ఆశయాలను స్ఫూర్తి గా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సంఘ సంస్కర్త జ్యోతిబాపూలే పూలే జయంతి సందర్భంగా స్థానిక బీసీ భవన్‌లో ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు సాధి కారత సాధించడంతోనే మహాత్మా జ్యోతిబా పూలేకు నిజమైన నివాళి అని బీసీ భవనానికి కలెక్టర్ నిధుల నుంచి తక్షణం నిధులు కేటాయించి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. విద్యా వంతులైన సమాజమే పూలేకు దక్కే అసలైన గౌరవమన్నారు. కూటమి ప్రభు త్వం బడుగు, బలహీన వర్గాల అభ్యు న్నతికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొ రేషన్ ఈడీ వినాయకరెడ్డి, ఆర్డీవో సాయి ప్రత్యూష, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధు లు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పూలే జయంతిని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు పాల్గొని పూలేకు నివాళి అర్పించారు.