ఉన్న వారికి తక్కువ... లేని వారికి ఎక్కువ
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:42 PM
చినవంక పంచాయతీ పరిధిలో గల గుల్లలపాడు గ్రామంలో ఇటీవల జరిగిన భూముల రీసర్వేలో అనేక తప్పులు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తమకు ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువగానో...తక్కువగానో నమోదైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): చినవంక పంచాయతీ పరిధిలో గల గుల్లలపాడు గ్రామంలో ఇటీవల జరిగిన భూముల రీసర్వేలో అనేక తప్పులు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తమకు ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువగానో...తక్కువగానో నమోదైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి వాస్తవం కంటే ఎక్కువగా ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌లో చూపిస్తోందని అంటున్నారు. మరికొందరికి ఉన్న భూముల కంటే తక్కువ విస్తీర్ణం చూపించడంతో వారంతా స్థానిక గ్రామపెద్దలకు తమ సమస్యను వివరించారు. రీ సర్వేలో ఎక్కువ మంది రైతుల భూములలో తప్పులు దొర్లడంపె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి మండల సర్వేయర్ లేకపోవడంతో అధికారులు సచివాలయ సర్వేలపైనే ఆధారపడి రీ సర్వే చేయించడం వల్ల తప్పులు దొర్లుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు అనేక గ్రామాలల్లో రీసర్వే జరగకపోవడంతో పాటు సర్వే ప్రక్రియ మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశిం చడం కూడా తప్పు లకు కారణంగా ఆరో పణలు ఉన్నాయి. అధి కారులు స్పందించి వెం టనే వీటిని సరి చేయాలని రైతులు కోరు తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మెట్లూరు పంచాయతీలో జరిగిన రీ సర్వేలో దొర్లిన తప్పులు సవరించడానికి రెవెన్యూ అధికారులు రెండు రోజుల పాటు స్థానిక సచివాలయంలో ఉండి..పని పూర్తి చేశారు. అయినా అక్కడక్కడా తప్పులు ఉన్నటు రైతులు చెప్పారు. దీనిపై రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ టి.శ్రావణ్ కుమార్ వద్ద ప్రస్తావించగా... గుల్లలపాడులో రీ సర్వేలో ప్రాఽఽథమికంగా భూముల విస్తీర్ణంలో తేడాలు ఉన్నట్లు రైతులు చెప్పారన్నారు. వారి నుంచి వివరాలు సేకరించి సరిచేస్తున్నట్టు వెల్లడించారు. తుది జాబితా విడుదలయ్యే వరకు రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ప్రాథమికంగా చిన్నచిన్న తప్పులు ఉంటే సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.