న్యాయసేవలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:28 AM
న్యాయసేవాధికారి సంస్థ ద్వారా రిమాండ్ ఖైదీలకు అంది స్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, జిల్లా సివిల్ న్యాయాధికారి హరిబాబు సూచించారు.
జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి హరిబాబు
నరసన్నపేట, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): న్యాయసేవాధికారి సంస్థ ద్వారా రిమాండ్ ఖైదీలకు అంది స్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, జిల్లా సివిల్ న్యాయాధికారి హరిబాబు సూచించారు. గురువారం స్థానిక సబ్‌జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెయిల్ కోసం ప్రయత్నించే రిమాండ్ ఖైదీలకు న్యాయసేవాధికారి సంస్థ తరుఫున ఉచిత న్యాయవాదిని నియమించడం జరుగుతుందన్నారు. సబ్‌జైలులో వసతి,భోజన సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సబ్‌జైలు సూపరింటెండెంట్ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ఉచిత న్యాయసేవలను వినియోగించుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. పాతపట్నంలోని సబ్‌జైల్‌ను ఆయన గురువారం సందర్శించారు. ఖైదీలతో మాట్లాడారు. ఆర్థికస్తోమత లేకుంటే వారికి ఉచిత న్యాయసేవలు అందించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. సబ్‌జైల్‌లో బేరక్‌లు, వాష్‌రూం, స్టోర్‌రూంలను పరిశీలించారు.
‘కేసులు పరిష్కరించుకోవాలి’
పలాస, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): లోక్‌అదాలత్‌లో అధి క సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవాలని స్థానిక మున్సిఫ్ మె జిస్ట్రేట్ కోర్టు న్యా యాధికారి యు. మాధురి కోరారు. గురువారం కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశా రు. ఆమె మాట్లాడుతూ వచ్చేనెల 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ఉందని తెలిపారు. ఏపీపీ పి.రమేష్, ఎస్‌ఐ వీఆర్‌బనాయుడు, పోలీసులు పాల్గొన్నారు.
మే 5న జాతీయ లోక్ అదాలత్
హిరమండలం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): కొత్తూరు కోర్డు ఆవరణలో మే5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కొత్తూరు కోర్డు న్యాయాధికారి కందికట్ల రాణి తెలిపారు. గురువారం కొత్తూరు కోర్డు ఆవరణలో కొత్తూరు, హిరమండలం, బత్తిలి పోలీసులతో సమావేశాన్ని నిర్వహించారు.