వృద్ధులకు అందుబాటులో న్యాయసేవలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:31 PM
వృద్ధులకు అన్నివేళలా న్యాయసేవలు అందుబాటులో ఉండేలా చూస్తామని జిల్లా నాయసేవాధి కార సంస్థ ్థకార్యదర్శి కె.హరిబాబు తెలిపారు.
శ్రీకాకుళం లీగల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వృద్ధులకు అన్నివేళలా న్యాయసేవలు అందుబాటులో ఉండేలా చూస్తామని జిల్లా నాయసేవాధి కార సంస్థ ్థకార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులతో సమావేశం నిర్వహిం చారు. వృద్ధులు ఆత్మ గౌరవంతో బతికేలా చూడడమే నాయసేవాధికార సంస్థ లక్ష్యమని తెలిపారు. అనంతరం ఆశ్రమంలో అందుతున్న ఆహా రం, వైద్యంపై ఆరా తీశారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబరు 15100కు ఫోన్ చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి వృద్ధాశ్రమం నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.