ములాఖత్ వద్దే న్యాయసేవలు
ABN , Publish Date - May 19 , 2026 | 11:56 PM
ఇకపై జైలు ములాఖత్ వద్దే న్యాయ సేవలు లభించే వీలు కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ చర్యలు చేపడు తోందని ఆ సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఇకపై జైలు ములాఖత్ వద్దే న్యాయ సేవలు లభించే వీలు కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ చర్యలు చేపడు తోందని ఆ సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. ఈ మేరకు మంగళ వారం అంపోలులోని జిల్లా జైలులో న్యాయ సేవాకేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్దాయిలకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన న్యాయ సహాయం అందిం చేందుకు ఈ డెస్క్ దోహదపడుతుందన్నారు. న్యాయ సేవలు అందించేందుకు ఇద్దరు న్యాయవాదులు, ఇద్దరు పారా లీగల్ వలంటీర్లు అందుబాటులో ఉంటారని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జైలు పరిసరాల్లో పరిశుభ్రతను పరిశీ లించారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్ నాయుడు, డిఫెన్స్ న్యాయ వాదులు పుట్టా అంజనీకుమార్, ఆఫీసు నాయుడు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.