ఎల్లవేళలా న్యాయ సహాయం
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:44 PM
నగరంలోని పలు వసతి గృహాలను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు బుధవారం సందర్శించారు.
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు వసతి గృహాలను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు బుధవారం సందర్శించారు. కలెక్టరేట్ రోడ్డులోని స్త్రీ సదనం, ఇలిసిపురం ఖ్యాతి ఫౌండేషన్ సంస్థలను సందర్శించి వాటిలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో మాట్లాడి వారి స్థితిగతులను అడిగి తెలుసు కున్నారు. ఆహారం, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. వారికి కావల్సిన న్యాయ సహాయం అందించేందుకు ఎల్లవేళలా సంస్థ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాధి గేదెల ఇందిరా ప్రసాద్, ఎస్.ధనలక్ష్మి, ఆర్.శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
న్యాయ అవగాహన పెంపొందించాలి
శ్రీకాకుళం లీగల్, ఫిబ్ర వరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో న్యాయ అవగా హన పెరిగినప్పుడే అనవ సర వాజ్యాలు తగ్గుతా యని పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ ప్లాపస్) అథారిటీ చైర్ పర్సన్ గూడూరు రజిని అన్నారు. బుధవారం స్థానిక న్యాయసేవా సదన్‌లో న్యాయ విద్యార్ధులకు చట్టాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీఆర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ మోజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.